national women parliament
-
ఒక్క డ్వాక్రా మహిళతోనైనా మాట్లాడించారా?
మహిళా సదస్సు నిర్వహణపై భూమన కరుణాకర రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత అంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మహిళా పార్లమెంట్ ఓ కిట్టీ పార్టీలాగా జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. పారిశ్రామిక రంగంలోని మహిళలతో వేదికను నింపి.. గొప్పగా నిర్వహించామని చెప్పకోవడం దౌర్భాగ్యమని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సదస్సులో ఒక్క డ్వాక్రా మహిళ గొంతన్నా వినిపించిందా? దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారు ఒక్కరైనా కనిపించారా? కనీసం ఒక్కటైనా ఉపయోగపడే చర్చ జరిగిందా? అని చంద్రబాబును ప్రశ్నించారు. కేవలం తన అనుచరవర్గం, తమ కుటుంబీకులకు సంబంధించిన వారి హడావుడితో, మహిళా సదస్సును టీడీపీ పార్టీ ఇంటి కార్యక్రమంగా నిర్వహించారని అన్నారు. ఈ సదస్సుకు మహిళల రోదన అంతా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా మారిందని, ఎమ్మెల్యే రోజా కన్నీళ్లను పన్నీరులా చల్లుకున్నారని మండిపడ్డారు. సదస్సు నిర్వాహకుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. ప్రతిపక్షం విషం చిమ్మటానికి ప్రయత్నిస్తోందనటాన్ని భూమన తీవ్రంగా వ్యతిరేకించారు. కడివెడు విషంలో చిటికెడు పాలు కలపడానికి వైఎస్సార్సీపీ సదస్సుకు వచ్చిందని చెప్పారు. టీడీపీ ఎంపీ కుమార్తె చంద్రబాబుకు వ్యతిరేకంగా తిరుపతిలో నిరసన తెల్పిన విషయాన్ని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత.. దూబగుంట రోశమ్మ ప్రస్తావన తీసుకురాగానే నిర్వాహకుల ముఖాలన్నీ కందగడ్డలుగా మారిపోయాయని భూమన చెప్పారు. కార్పొరేట్ కార్పెట్ల కింద పాలన.. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కార్పొరేట్ కార్పెట్ల కింద నుంచి కొనసాగుతోందని భూమన ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసపూరిత హామీలతో వంచించి ప్రచార ఆర్భాటాలతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. -
‘రోజా కన్నీళ్లతో పన్నీరు చల్లే ప్రయత్నం’
హైదరాబాద్: చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమిటని సూటిగా ప్రశ్నించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జాతీయ పార్లమెంట్ మహిళా సదస్సును ఓ కిట్టీ పార్టీగా మార్చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా కన్నీళ్లతో మహిళా సదస్సులో పన్నీరు చల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అన్యాయం జరిగిన ఒక్క మహిళ గురించిచైనా చర్చ జరిగిందా అని ప్రశ్నించారు. సదస్సును సీఎం చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సంబంధిత కథనాలు చదవండి: ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడంపై వైఎస్ జగన్ స్పందన ప్రతిపక్షంపై నిర్బంధాలేమిటి? నన్ను.. చంపేస్తారేమో నిస్సిగ్గుగా అరాచకం -
రోజాను అడ్డుకోవడం అప్రజాస్వామికం: కాంగ్రెస్
విజయవాడ: మహిళా పార్లమెంట్ సభ్యుల సదస్సుకు హాజరయ్యేందుకు వెళుతున్నఎమ్మెల్యే ఆర్కే రోజాను ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకోవడం దారుణమని, అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, కె. శివాజి పేర్కొన్నారు. సోమవారం ఉదయం వారిక్కడ మీడియాతో మాట్లాడుతూ రోజాను అడ్డుకోవడం మహిళలందరినీ అవమానించడమేనన్నారు. కేవలం టీడీపీకి అనుకూలంగా ఉన్న వారినే మహిళా పార్లమెంట్ సభ్యుల సదస్సుకు ఆహ్వానించడం దారుణమని, మహిళా సమస్యలపై పోరాటం చేస్తున్న సోనియాగాంధీ, మేధా పాట్కర్, బృందా కారత్ తదితరులను ఎందుకు ఆహ్వానించలేదని వారు ప్రశ్నించారు. -
మహిళా పార్లమెంటు వద్ద విద్యార్థినుల ఆందోళన
-
మహిళా పార్లమెంటు వద్ద విద్యార్థినుల ఆందోళన
అమరావతి: అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్ వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పార్టిస్పెషన్ సర్టిఫికెట్లు ఇవ్వటంలో వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టిస్పెషల్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వరంటూ మండిపడ్డారు. పార్లమెంటరీ సదస్సు లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విద్యార్థినులు ఆగ్రహం వెలిబుచ్చారు. సర్దిచెప్పటానికి ప్రయత్నించిన పోలీస్ కమిషనర్ సవాంగ్‌తో అర్దగంటకు పైగా విద్యార్థినులు వాదనకు దిగారు. సర్టిఫికెట్టు ఇచ్చేంత వరకు కదిలేది లేదని సభా ప్రాంగణంలోనే విద్యార్థినులు నిలబడ్డారు. -
నేషనల్ ఉమెన్ పార్లమెంట్‌పై స్పీకర్ సమీక్ష
- హాజరైన ఎంఐటీ ప్రతినిధులు అమరావతి : నేషనల్ ఉమెన్ పార్లమెంట్ నిర్వహణపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం చర్చించారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి చర్చా వేదికలో అమరావతి వేదికగా సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంఐటీ ప్రతినిధి రాహుల్ కరాడ్, స్పెషల్ ఆఫీసర్ రామలక్ష్మిలు చర్చలో పాల్గొన్నారు. పూనేలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయపరుస్తుంది. 110 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా మహిళా పార్లమెంటు, శాసనసభ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మంది విద్యార్థినులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. మూడు రోజుల వసతి, ఇతర అంశాలపై విజయవాడ మునిసిపల్ కమిషనర్ వీరపాండ్యన్, బస్ కలెక్టర్ లక్ష్మీషాలతో సభాపతి కోడెల చర్చించారు. యునెస్కో కూడా ఈ సదస్సులో భాగస్వామి కాబోతున్నది. మహిళా పార్లమెంటేరియన్లు, వివిధ రంగాల్లో నిష్నాతులైన మహిళా ప్రముఖులను కూడా స్పీకర్ ఆహ్వానిస్తారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసాద్ పౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ల సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ సమావేశాలు నిర్వహిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కీలక భాగస్వామి కానుంది. ఇప్పటి వరకు సిద్ధం చేసిన తాత్కాలిక కార్యాచరణను అనుసరించి ‘మహిళా ప్రోత్సాహం- ప్రజాస్వామ్యం పటిష్టత’ అనే అంశంపై మూడు రోజులు మహాసభలు జరగనున్నాయి. విభిన్న అంశాలు కూడా ఈ సభల్లో చర్చకు రానున్నాయి. తొలిరోజు ‘మహిళా సాధికారిత-రాజకీయ సవాళ్ళు, వ్యక్తిత్వ నిర్మాణం, భవిష్యత్ దార్శనికత, గురుశిశ్యుల సంబంధాలు’ అన్న అంశాలపై చర్చ జరుగుతుంది. రెండో రోజు ‘మహిళల స్థితి-నిర్ణయాత్మక శక్తి, మీకు మీరే సాటి’ అనే అంశంపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. మూడో రోజు మహిళా సాధికారిత కోసం పరుగు నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కమిటీకి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను చైర్మన్‌గా నియమించాలని సభాపతి నిర్ణయించారు. కార్యక్రమం విజయవంతానికి తగిన సమయం కావాలని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధులు డాక్టర్ కోడెలకు విజ్ఞప్తి చేశారు. సమావేశాలకు చైర్మన్‌గా స్పీకర్, చీఫ్ ప్యాట్రన్‌గా సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరించనున్నారు. ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ పేరుతో ప్రజాపాలన రంగంలో శిక్షణను ఇచ్చే విద్యా సంస్థ కూడా ఇందులో ఉంది. మహారాష్ట్రలో రాహుల్‌కు చెందిన గ్రూప్ 79 విద్యాసంస్థలను నిర్వహిస్తున్నది. స్పీకర్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ఘాట్ వద్ద సభలు నిర్వహిస్తే బాగుంటుందనే నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.