
కోర్టులో ఎమ్మెల్యే రోజా ప్రైవేటు కేసు
విజయవాడ: మహిళా సదస్సు వచ్చిన తనను అక్రమంగా నిర్బధించడంపై వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా మంగళవారం గన్నవరం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. పోలీసులు తనను చట్టవిరుద్ధంగా అడ్డుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.
మహిళా సాధికారిత సదస్సుకు తనను ఆహ్వానించి నిర్బంధించడం దారుణమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై న్యాయపోరాటం చేస్తానని అంతకుముందు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ నెల 11 మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డుకుని గన్నవరం విమానాశ్రయం నుంచి బలవంతంగా హైదరాబాద్ తరలించిన సంగతి తెలిసిందే.