Private case
-
‘శ్రీచైతన్య’పై ప్రైవేటు కేసు
కర్నూలు(లీగల్): ఫీజు బకాయి చెల్లించలేదనే నెపంతో ఓ విద్యార్థిని కళాశాల హాస్టల్ నుంచి గెంటివేయడంపై కర్నూలు కోర్టులో ప్రైవేటు కేసు నమోదైంది. ఇందులో కళాశాల యాజమాన్యానికి సహకరించిన పోలీసులపైనా మరో ఫిర్యాదు దాఖలైంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బేతంచర్లకు చెందిన డి.ఎల్.ఎన్.శాస్త్రి కుమార్తె కర్నూలు సమీపంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండేది. ఫీజు బకాయి చెల్లించలేదనే నెపంతో 2014 ఏప్రిల్ 8న అర్ధరాత్రి కళాశాల యాజమాన్యం హాస్టల్ నుంచి గెంటేసింది. అప్పట్లో ఆ విద్యార్థిని తండ్రి కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కళాశాల యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సదరు కేసు దర్యాప్తు చేయాలని కర్నూలు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వినోద్‌కుమార్‌ను ఆదేశించింది. ఈ కేసులో పోలీసు అధికారులు ఫిర్యాది, బాధితురాలిని విచారించకుండానే తప్పుడు కేసంటూ కోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో ఫిర్యాది తిరిగి స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద తగిన సాక్ష్యాధారాలున్నాయని కోర్టుకు విన్నవించారు. శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం, కర్నూలు పోలీసులపై చర్యలు చేపట్టి.. తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసు ఈనెల 25న విచారణకు రానున్నట్లు ఫిర్యాది తెలిపారు. -
కోర్టులో ఎమ్మెల్యే రోజా ప్రైవేటు కేసు
విజయవాడ: మహిళా సదస్సు వచ్చిన తనను అక్రమంగా నిర్బధించడంపై వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా మంగళవారం గన్నవరం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. పోలీసులు తనను చట్టవిరుద్ధంగా అడ్డుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. మహిళా సాధికారిత సదస్సుకు తనను ఆహ్వానించి నిర్బంధించడం దారుణమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై న్యాయపోరాటం చేస్తానని అంతకుముందు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ నెల 11 మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డుకుని గన్నవరం విమానాశ్రయం నుంచి బలవంతంగా హైదరాబాద్ తరలించిన సంగతి తెలిసిందే. -
మూడు పత్రికలపై ఒవైసీ ప్రైవేటు కేసు
హైదరాబాద్: తనకు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్న ప్రతికా సంస్థలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చట్ట పరమైన చర్యలను కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురిస్తున్న ఆ మూడు సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నాంపల్లి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. పాకిస్థాన్‌పై భారత్ యుద్ధాన్ని ప్రకటిస్తే 25 లక్షల మంది ముస్లింలు పాక్ సైన్యంలో కలుస్తారని తాను వ్యాఖ్యానించినట్లు ఆ పత్రికలు తప్పుడు కథనాన్ని ప్రచురించాయుని ఆయన ఆరోపించారు. ‘కాశ్మీర్ అబ్జర్వర్’ ఎడిటర్ ఇన్ చీఫ్ సజ్జద్ హైదర్, బెంగళూరుకు చెందిన గ్రీనియం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎండీ బీజీ మహేశ్, ‘వన్ ఇండియా’ ఆన్లైన్ పోర్టల్, ముంబైకి చెందిన ‘సామ్నా’ పత్రిక అసోసియేట్ ఎడిటర్ ప్రేంశుక్లా తదితరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. -
తమ్ముళ్ల దౌర్జన్యం!
ధర్మవరం, న్యూస్‌లైన్ : ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులపై టీడీపీ నాయకులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ మాట వినలేదంటూ రెవెన్యూ, పంచాయతీరాజ్, మండల పరిషత్, పోలీసు తదితర శాఖల అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు చీటికి మాటికి అధికారులపై నోరు పారేసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు పనిచేసిన అధికారులందరిపై విచారణకు ఆదేశిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తమ మాట వినని పోలీసు అధికారులపై ప్రతి చిన్న విషయానికి ప్రైవేటు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇతర శాఖ అధికారులనైతే వారి కార్యాలయాల్లోనే దిగువస్థాయి సిబ్బంది ముందే నోటికొచ్చినట్లు తిడుతున్నారు. ముఖ్యంగా కొంత మంది బలహీన వర్గాలకు చెందిన అధికారులపై ఆయన చూపుతున్న ప్రతాపం అంతా ఇంతా కాదు. స్టోర్ డీలర్‌షిప్‌లు, పంచాయతీ అభివృద్ధి పనులు, ఉపాధి పనులు తదితర వాటిని తన అనుయాయులకు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పైగా వారిని వెనకేసుకొస్తున్నారు. ఇక గట్టిగా మాట్లాడే అధికారులపై ఉన్నతాధికారులకు పదే పదే ఫిర్యాదు చేస్తూ వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. దీంతో అధికారులు విధులకు హాజరు కావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారు బదిలీపై వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. బెదిరింపుల పర్వం ఇలా... ధర్మవరం డివిజన్ స్థాయి అధికారిని ఏకంగా విలేకరుల సమావేశంలోనే కులం పేరుతో తిట్టారు. ఆయన్ను బదిలీ చేయకపోతే కార్యాలయం ఎదుటే ఆమరణ దీక్ష చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఓ మండల స్థాయి అధికారికి ఫోన్ చేసి ‘మేమే అధికారంలోకి వచ్చేది. మిమ్మల్ని శంకరగిరి మన్యాలు పట్టిస్తామ’ని బెదిరించారు. బత్తలపల్లి మండలంలో ఓ అధికారి తన వారికి పనులు చేసిపెట్టలేదన్న కారణంతో ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు దిగారు. టీడీపీ వారికి చెందిన దొంగ ఓట్లు తొలగించారన్న నెపంతో బీఎల్ఓలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించిన స్టోర్ డీలర్లను అధికారులు తొలగించారు. అయితే... వారికి తిరిగి డీలర్‌షిప్‌లు కట్టబెట్టాలంటూ సదరు టీడీపీ నేత అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వారు మాట వినకపోవడంతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఉపాధి హామీ సిబ్బంది అనుకూలంగా వ్యవహరించలేదనే సాకుతో వారందరినీ వెంటనే తొలగించాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు సదరు సిబ్బందిని విచారిస్తే ఎటువంటి అక్రమాలూ జరగలేదని తేలింది. గ్రామాల్లో చిన్నచిన్న ఘటనలకు పెద్ద సెక్షన్ల కింద కేసులు పెట్టాలని పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అందుకు వారు అంగీకరించకపోవడంతో ప్రైవేటు కేసులు వేసి వేధిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న తన వా హనాలకు జరిమానా విధించారన్న ఉద్దేశంతో ఓ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.