మూడు పత్రికలపై ఒవైసీ ప్రైవేటు కేసు
హైదరాబాద్: తనకు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్న ప్రతికా సంస్థలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చట్ట పరమైన చర్యలను కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురిస్తున్న ఆ మూడు సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నాంపల్లి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు.
పాకిస్థాన్‌పై భారత్ యుద్ధాన్ని ప్రకటిస్తే 25 లక్షల మంది ముస్లింలు పాక్ సైన్యంలో కలుస్తారని తాను వ్యాఖ్యానించినట్లు ఆ పత్రికలు తప్పుడు కథనాన్ని ప్రచురించాయుని ఆయన ఆరోపించారు. ‘కాశ్మీర్ అబ్జర్వర్’ ఎడిటర్ ఇన్ చీఫ్ సజ్జద్ హైదర్, బెంగళూరుకు చెందిన గ్రీనియం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎండీ బీజీ మహేశ్, ‘వన్ ఇండియా’ ఆన్‌లైన్ పోర్టల్, ముంబైకి చెందిన ‘సామ్నా’ పత్రిక అసోసియేట్ ఎడిటర్ ప్రేంశుక్లా తదితరులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.