Gannavaram Court
-
టీడీపీ కార్యకర్తలతో రౌడీయిజం చేయిస్తారా?
-
టీడీపీ కార్యకర్తలతో రౌడీయిజం చేయిస్తారా?
విజయవాడ: న్యాయం కోసం కోర్టుకు వస్తే టీడీపీ కార్యకర్తలతో రౌడీయిజం చేయిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడికి తిరగాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి వీసా తీసుకోవాలా అని ఆమె శుక్రవారమిక్కడ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని డీజీపీ, తదితర పోలీసు అధికారులపై దాఖలు చేసిన ప్రైవేటు కేసు విచారణ నిమిత్తం ఎమ్మెల్యే రోజా ఇవాళ కృష్ణాజిల్లా గన్నవరం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. త్వరలోనే చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. నందిగామ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై కూడా టీడీపీ కార్యకర్తలు కూడా ఇలాగే దౌర్జన్యం చేశారన్నారు. తాను డీజీపీపై కోర్టులో కేసు వేస్తే టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రోజా సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చంద్రబాబు పూర్తిగా తుంగలోకి తొక్కారన్నారు. ప్రజల అభిమానం పొందాలంటే వారికి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని అన్నారు. కాగా ఎమ్మెల్యే రోజా కోర్టుకు హాజరవుతున్న సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ జెండాలతో కోర్టు సమీపంలోకి ర్యాలీగా వచ్చారు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడ నుంచి పంపించివేశారు. కేసు విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా పడింది. -
గన్నవరం కోర్టు వద్ద తెలుగుతమ్ముళ్ల పైత్యం
-
గన్నవరం కోర్టు వద్ద తెలుగుతమ్ముళ్ల పైత్యం
గన్నవరం : అధికారంలో ఉన్నామనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు మరోసారి తమ పైత్యం ప్రదర్శించారు. మహిళా పార్లమెంట్ సమావేశానికి హాజరు కాకుండా తన హక్కులకు భంగం కలిగించారంటూ ఏపీ డీజీపీపై వేసిన ప్రయివేట్ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా గన్నవరం కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గన్నవరం కోర్టు వద్ద టీడీపీ జెండాలతో కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగారు. రోజాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా కోర్టు కార్యకలాపాలకు విఘాతం కలిగించే యత్నం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. కోర్టు వద్ద ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తామని పోలీసుల హెచ్చరికలతో టీడీపీ కార్యకర్తలు వెనుదిరిగారు. మరోవైపు కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. -
కోర్టులో ఎమ్మెల్యే రోజా ప్రైవేటు కేసు
విజయవాడ: మహిళా సదస్సు వచ్చిన తనను అక్రమంగా నిర్బధించడంపై వైఎస్సార్ సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా మంగళవారం గన్నవరం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. పోలీసులు తనను చట్టవిరుద్ధంగా అడ్డుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. మహిళా సాధికారిత సదస్సుకు తనను ఆహ్వానించి నిర్బంధించడం దారుణమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై న్యాయపోరాటం చేస్తానని అంతకుముందు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ నెల 11 మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే రోజాను పోలీసులు అడ్డుకుని గన్నవరం విమానాశ్రయం నుంచి బలవంతంగా హైదరాబాద్ తరలించిన సంగతి తెలిసిందే.