గన్నవరం కోర్టు వద్ద తెలుగుతమ్ముళ్ల పైత్యం | tdp workers protest at gannavaram court | Sakshi
Sakshi News home page

గన్నవరం కోర్టు వద్ద తెలుగుతమ్ముళ్ల పైత్యం

Published Fri, Mar 3 2017 12:12 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

tdp workers protest at gannavaram court

గన్నవరం : అధికారంలో ఉన్నామనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు మరోసారి తమ పైత్యం ప్రదర్శించారు. మహిళా పార్లమెంట్‌ సమావేశానికి హాజరు కాకుండా తన హక్కులకు భంగం కలిగించారంటూ ఏపీ డీజీపీపై వేసిన ప్రయివేట్‌ కేసు విచారణ నిమిత్తం  శుక్రవారం వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా గన్నవరం కోర్టుకు హాజరయ్యారు. 

ఈ నేపథ్యంలో గన్నవరం కోర్టు వద్ద టీడీపీ జెండాలతో కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగారు. రోజాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా కోర్టు కార్యకలాపాలకు విఘాతం కలిగించే యత్నం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. కోర్టు వద్ద ఆందోళన చేస్తే అరెస్ట్‌ చేస్తామని పోలీసుల హెచ్చరికలతో టీడీపీ కార్యకర్తలు వెనుదిరిగారు. మరోవైపు కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement