
వడమాలపేట : అధికార పార్టీ నాయకులు డబ్బులు దోచుకోవడానికే ఇరిగేషన్ పనులు పెడుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. వడమాలపేటలో శనివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వాటి గురించి పట్టించుకోకుండా డబ్బులు దోచుకునే పనిలో అధికారపార్టీ వారు ఉన్నారని ఆరోపించారు. అభివృద్ధి పనులకు తాము ప్రతిపాదనలు పంపితే వారు అడ్డుకుం టున్నారని, వారైనా చేస్తారా ? అంటే అదీ లేదని ఆమె ఆవేదన వ్య క్తం చేశా రు. అభివృద్ధి ప్రకటనలకే పరి మితమైందని, వాస్తవ పరిస్థితులు భి న్నంగా ఉన్నాయని ఆమె విమర్శించారు.
మీ ఊరు – మీ ఎంపీ కార్యక్రమం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన తరువాత తన పార్లమెంట్ పరిధిలో మీ ఊరు – మీ ఎంపీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెలిపారు. పార్టీలు ఎన్నికల సమయంలోనేనని, తరువాత అందరూ కలసి అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నాయకులు, పార్టీలతో నిమిత్తం లేకుండా తనను కలవవచ్చునని, అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉన్న 510 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.50 లక్షలతో ఇంటర్‌నెట్, టీవీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పలు పంచాయతీల్లో చెత్తను ఎత్తడానికి ట్రాక్టర్లను కూడా ఎంపీ నిధులతో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment