
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చివరి బడ్జెట్‌లోనూ మహిళలకు అన్యాయం చేశారన్నారు. మహిళల అక్రమ రవాణాలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నారు. చంద్రబాబు పాలనలో మహిళకు భద్రత కరువైందని ఆరోపించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే ఇప్పటి వరకు శిక్షల్లేవన్నారు.
సీఎం నియోజక వర్గంలో మహిళను వివస్త్రను చేసినా పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు. బెల్టు షాపులను దశలవారీగా ఎత్తేస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందన్నారు. మరో వైపు మహిళల కోటాలో లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. లోకేష్‌ను మంత్రిని చేస్తే.. రాష్ట్రమంతటా ఉద్యోగాలిచ్చినట్లేనా అని ప్రశ్నించారు.