
'దిమ్మతిరిగేలా చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి'
- కాకినాడ ప్రచారంలో ఓటర్లు ఎమ్మెల్యే రోజా పిలుపు
కాకినాడ: ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలుచేయని చంద్రబాబుకు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాలని కాకినాడ ఓటర్లకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పిలుపునిచ్చారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 31, 32వ డివిజన్లలో శనివారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పాలన తీరుపై నిప్పులు చెరిగారు. బుద్ధిలేని కుమారునికి మంత్రి పదవి ఇప్పించుకున్న చంద్రబాబు.. లక్షలాది యువతలో ఏ ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని విమర్శించారు. ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వారే కాకినాడ ఓటర్లు అనే తరహాలో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని సూచించారు.