
సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబునాయడు అసమర్థనాయుకుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. తమ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఆమె పొల్గొని ప్రసంగించారు. చంద్రబాబుకు సమస్య వస్తే.. రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారని, ఓటుకునోట్లు కేసు భయంతోనే ప్రత్యేక హోదా అంశాన్నినీరుగార్చరని మండిపడ్డారు. బీజేపీ లాలుచీలో భాగంగానే మహరాష్ట్ర ఎంపీ భార్యను టీటీడీ మెంబర్‌గా నియమించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.