సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సీఎంగా ఇదే చివరి జనవరి 1 అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. 2014లో ఏపీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఈ ఏడాది వెనక్కు తీసుకోబోతున్నారని, ఇక ఆయన తన మనవడితో ఆడుకోవచ్చని ట్వీట్ చేశారు. ఇంతకంటే చంద్రబాబు తెలుగు ప్రజలకు ఇవ్వగలిగింది ఏముంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక మరో ట్వీట్‌లో హరికృష్ణ మృతదేహం సాక్షిగా చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించారనే మీమ్ పోస్ట్ చేశారు. మాదక ద్రవ్యాలను నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.
#SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/8I0PT403na
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 1, 2019
Comments
Please login to add a commentAdd a comment