ఆ టీడీపీ నాయకులకు జైలు ఖాయం : విజయసాయిరెడ్డి | Vijay Sai Reddy Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఆ టీడీపీ నాయకులకు జైలు ఖాయం : విజయసాయిరెడ్డి

Published Thu, Nov 29 2018 9:57 PM | Last Updated on Thu, Nov 29 2018 10:28 PM

Vijay Sai Reddy Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాస్‌వర్డుల్లో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఇద్దరూ దొరికారని, వారికి జైలు ఖాయమని వైఎస్సార్‌ సీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబుపై, ఆయన బినామీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జయభేరీ మురళీమోహన్‌ చౌదరి, మంత్రి నారాయణలు పట్టుబడితే చాలా వరకు బినామీ ఖాతాలు బయటపడినట్టేనని పేర్కొన్నారు. టెక్నాలజీ సృష్టికర్త అని చెప్పుకునే చంద్రబాబు వీక్‌ పాస్‌వర్డ్‌లను పెట్టుకున్నారన్నారు.

బాబు పాస్‌వర్డ్‌లను ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, ఈడీ, ఐటీలు ఈజీగా బ్రేక్‌ చేశాయని చెప్పారు. పాస్‌వర్డులను మార్చి మిగిలిన దొంగ అకౌంట్లను ఓపెన్‌ కాకుండా చూసుకోగలరంటూ చురకలంటించారు. ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్‌ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. చం‍ద్రబాబు సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినా.. తెలంగాణను అభివృద్ధి చేశానంటూ అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నారన్న సంగతి మర్చిపోయినట్లున్నారంటూ ఎద్దేవా చేశారు. బాబు తన చేతకాని తనంతో ఏపీ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని, అయినప్పటికి విజేతనంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement