సాక్షి, హైదరాబాద్ : తన సుపుత్రుడు నారా లోకేశ్ పోటీ విషయంలో తనను తప్పుదోవ పట్టించారని చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ‘నాలుగు సురక్షిత స్థానాలు ఎంపిక చేయమంటే మంగళగిరి సేఫ్..అని మిస్‌గైడ్ చేశారని వాపోతున్నారట. ఇంటెలిజెన్స్ కూడా అంచనా వేయలేక పోయిందని ఊగిపోతున్నారట.. ఆర్కే నువ్వు గెలిచావ్’ అని ఆయన ట్వీట్ చేశారు. లోకేశ్‌ను భీమిలీ నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావించారని కానీ సీనియర్లే తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు.
‘తమ్ముళ్లూ అవునా? కాదా? గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. నాకు భరోసా ఇవ్వండి. గెలిపిస్తాం అని చెప్పండి. నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి. ఇవీ చంద్రబాబు గారి హైపర్ ఫ్రస్టేషన్ మాటలు. గండం గట్టెక్కితే చాలన్నట్టు వల విసురుతున్నాడు. ఓటర్ల కాళ్లు పట్టుకోవడమే తక్కువ.’ అని మరో ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘‘రావాలి జగన్ కావాలి జగన్’ గేయాన్ని పదేపదే వింటూ ఆదరిస్తున్న ప్రజానీకానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చగల ధీరుడు మన జగన్’ అని తెలిపారు.
పిచ్చి తగ్గనట్టుంది ఇంకా..
‘తన ఇంట్లో బెల్లంకొండ సురేశ్ ను రివాల్వర్ తో కాల్చిన కేసులో బాలక్రిష్ణ జైలుకు పోకుండా అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు చౌదరి ఆయనకు మెంటల్ ఉందని సర్టిఫికేట్ ఇచ్చాడు. బెయిల్ దొరికిందాక రెండు నెలలు కరెంట్ షాక్ లిచ్చారు. వ్యాధి నయం కానట్టుంది. కార్యకర్తల్ని కొడుతున్నాడు.’ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment