బాబు సర్కార్‌ను కూల్చేయాలి: రోజా
Published Sat, Mar 11 2017 4:01 PM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM
విజయనగరం : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ఎమ్మెల్యే రోజా పిలుపు ఇచ్చారు. శనివారం విజయనగరంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తోడేళ్లను కాపాడుకునేందుకు ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడవాళ్ల మాన ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని ఆరోపించారు. అలాగే దళిత మంత్రితో కాళ్లు పట్టించుకున్న చంద్రబాబు మహిళలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
పేరుకే తప్ప మహిళా మంత్రులకు ఎలాంటి అధికారాలు లేవని, మహిళల సంక్షేమాన్ని గాలి కొదిలేస్తే ప్రజలు తాటతీస్తారన్న సంగతిని చంద్రబాబు గుర్తుంచు కోవాలన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశంలో డ్వాక్రా మహిళలకు రూ.10 వేల కోట్లు, మహాలక్ష్మి పథకానికి నిధులు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement