'కోడి పందేలను అడ్డుకోవడం దురదృష్టకరం' | MLA supports Cockfights Ahead of Sankranti | Sakshi
Sakshi News home page

'కోడి పందేలను అడ్డుకోవడం దురదృష్టకరం'

Published Sat, Jan 13 2018 6:38 PM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

MLA supports Cockfights Ahead of Sankranti - Sakshi

విజయవాడ : కోడి పందేలను పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. పూర్వం నుంచి కోడి, పొట్టేలు పందేలను పండుగ సంప్రదాయంలో భాగంగా వేడుకలాగా నిర్వహించేవారన్నారు. హింసకు తావు లేకుండా చట్టానికి లోబడి ఈ వేడుకలు జరుపుతున్నారని తెలిపారు. అయితే ఎవరో ఓ వ్యక్తి కోర్టుకి వెళితే పోలీసులు అడ్డుకోవడం మెజార్టీ ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వనట్టేనని పేర్కొన్నారు. తమిళనాడులో జల్లి కట్టు కోసం ఆర్డినెన్స్ తెచ్చారు. ఇక్కడ అలా కాకుండా కేవలం సంక్రాంతి సందర్భంగా 3 రోజులు కోళ్ల పందేలకు అనుమతి ఇస్తే బాగుంటుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement