సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో మూడవ రోజు కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. భీమవరం, దెందులూరు, నర్సాపురం, జంగారెడ్డిగూడెం, తణుకు, పాలకొల్లు, ఉండి ప్రాంతాలలో భారీగా కోడి పందాల బిరులు ఏర్పాటు చేశారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కోడి పందాల బిరులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. కాగా చింతలపూడి కోడి పందేల్లో ఓ కోడిపుంజుకి కత్తిని కడుతుండగా ఒక్కసారిగా కాళ్లు విదిలించింది. దీంతో ఆ కత్తి పందేలని చూడగానికి వెళ్లిన సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తికి తొడభాగంలో గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి మృతి చెందాడు. కోడి పందాల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కృష్ణా : సాంప్రదాయ సంక్రాంతి సంబరాల బరిలో తలపడేందుకు పందెం పుంజులు కాలుదువ్వుతున్నాయి. ఏడాదిపాటు కఠోర శిక్షణ ఇచ్చిన పందెం రాయుళ్లు తమ కోళ్లతో కదనరంగానికి క్యూలు కడుతున్నారు. పౌరుషాన్ని చాటి యజమానుల పరువు నిలిపేందుకు పందెం కోళ్లు విజయమా వీరమరణమా అన్నట్టు తలపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment