
చంద్రబాబుతో టీ-టీడీపీ నేతల భేటీ
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, గరికపాటి రామ్మోహనరావు, ఎల్. రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. వారితో పాటు ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు.