t-tdp leaders
-
చంద్రబాబుతో టీ-టీడీపీ నేతల భేటీ
-
చంద్రబాబుతో టీ-టీడీపీ నేతల భేటీ
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, గరికపాటి రామ్మోహనరావు, ఎల్. రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. వారితో పాటు ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. -
మ్యాచ్ ఫిక్సర్లకు టికెట్లు ఇప్పించిన ఘనత మీదే!!
టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఉన్న షకీల్ అహ్మద్‌కు బోధన టికెట్ ఇప్పించిన ఘనత కవితకే దక్కుతుందని ఆయన ఆరోపించారు. అవినీతిపరులు, భూకబ్జాదారులు, డ్రగ్స్ కేసులలో ఉన్న క్రిమినల్స్‌ను కవిత చేరదీస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొకైన్, డ్రగ్స్ కేసులో అరెస్టయిన పరస రవికుమార్ నిర్వహించిన మిస్ తెలంగాణ లోగోను కవిత ఎలా ఆవిష్కరిస్తారని రాజారాం యాదవ్ ప్రశ్నించారు. కుట్రలో భాగంగానే విమలక్కపై కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు.