టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఉన్న షకీల్ అహ్మద్కు బోధన టికెట్ ఇప్పించిన ఘనత కవితకే దక్కుతుందని ఆయన ఆరోపించారు.
అవినీతిపరులు, భూకబ్జాదారులు, డ్రగ్స్ కేసులలో ఉన్న క్రిమినల్స్ను కవిత చేరదీస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొకైన్, డ్రగ్స్ కేసులో అరెస్టయిన పరస రవికుమార్ నిర్వహించిన మిస్ తెలంగాణ లోగోను కవిత ఎలా ఆవిష్కరిస్తారని రాజారాం యాదవ్ ప్రశ్నించారు. కుట్రలో భాగంగానే విమలక్కపై కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు.
మ్యాచ్ ఫిక్సర్లకు టికెట్లు ఇప్పించిన ఘనత మీదే!!
Published Thu, Apr 2 2015 5:52 PM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM
Advertisement
Advertisement