బాసర ఆలయ అభివృద్ధికి రూ.125 కోట్లు
నిర్మల్: బాసర ఆలయ అభివృద్ధికి రూ.125కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న కవి సమ్మేళనంలో భాగంగా ఆమె ఆదివారం బాసరకు వచ్చారు.
ఈసందర్భంగా బాసర సరస్వతీ దేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రూ.125 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని త్వరలోనే సీఎం కేసీఆర్ బాసరలో పర్యటించి, అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.