వాంగ్మూలం ఇచ్చిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్ | mla stefenson records statement at acb court | Sakshi
Sakshi News home page

వాంగ్మూలం ఇచ్చిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్

Published Wed, Jun 17 2015 4:56 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

వాంగ్మూలం ఇచ్చిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్

వాంగ్మూలం ఇచ్చిన ఎమ్మెల్యే స్టీఫెన్సన్

ఓటుకు కోట్లు కేసులో కీలక సాక్షి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తన వాంగ్మూలాన్ని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఇచ్చారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆయన వద్ద వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ముందుగా బోయిగూడ ప్రాంతంలోని తన ఇంటి వద్ద నుంచి బులెట్ ప్రూఫ్ కారులో కుమార్తె జెస్సికా, స్నేహితుడు మార్క్ టేలర్లతో కలిసి బయల్దేరి కోర్టుకు వెళ్లిన స్టీఫెన్సన్.. అక్కడ అత్యంత కీలకమైన తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ఓటుకు కోట్లు కేసు మొత్తం ఆయన చుట్టూనే తిరిగిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ఆఫర్ గానీ, చంద్రబాబు ఆడియో టేపులు గానీ.. ప్రతి అడుగులోనూ స్టీఫెన్సన్ ప్రధాన సాక్షిగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన ఫిర్యాదు మేరకే ఏసీబీ వర్గాలు వలపన్ని రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహాలను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement