
నిప్పువా.. కందిపప్పువా బాబూ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు సెటైర్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు సెటైర్లు వేశారు. రాజకీయాల్లో తనను తాను నిప్పు లాంటి మనిషినని చంద్రబాబు చెప్పుకొంటారని, ఇప్పుడు ఏసీబీకి సహకరించి నిప్పువో.. కందిపప్పువో నిరూపించుకోవాలని ఆయన సవాలు చేశారు.
గతంలో స్టాంపుల కుంభకోణంలో కృష్ణయాదవ్ను సస్పెండ్ చేశారని, అలాంటప్పుడు ఇప్పుడు ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికినా ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.