ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన మత్తయ్య కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. ఈనెల పదోతేదీన మత్తయ్య విజయవాడ సత్యన్నారాయణపురం పోలీసు స్టేషన్కు వచ్చారు. స్వయంగా ఆయనే వచ్చి సీఐకి ఫిర్యాదు చేయడంతో.. దీనిపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే కేసును సీఐడీకి అప్పగించింది.