రాజకీయాల్లో ముడుపులు సర్వసాధారణం: జేసీ | bribing is quite common in politics, says tdp mp diwakar reddy | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో ముడుపులు సర్వసాధారణం: జేసీ

Published Tue, Jun 16 2015 8:20 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

రాజకీయాల్లో ముడుపులు సర్వసాధారణం: జేసీ - Sakshi

రాజకీయాల్లో ముడుపులు సర్వసాధారణం: జేసీ

రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి ప్రధాని వరకు ముడుపులు ఇవ్వడం సర్వ సాధారణమని తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటికి మరో నాయకుడు, ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ముడుపుల వ్యవహారంలో రేవంత్ రెడ్డి పట్టుబడటం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆధారాలు ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోవాలని జేసీ చెప్పారు. దీన్ని ఓ పెద్ద విషయంగా చూపిస్తే.. రెండు రాష్ట్రాల ప్రజలపై ప్రభావం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement