ఎలుక తోక తెచ్చి ఏడాది పాటు ఉతికినా, నలుపు నలుపే గాని, తెలుపు కాదు అని తెలుగులో ఓ సామెత ఉంది. అప్పుడప్పుడు ఇది అనుకోకుండా.. నేనున్నానంటూ మరీ గుర్తుకొస్తుంది. ఆ అవసరాన్ని తెలుగు ప్రజలకు తరచుగా గుర్తు చేస్తున్నారు టీడీపీ నేత నారా లోకేష్. పాదయాత్రలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంలో బోలెడు తప్పులు (కావాలనో?.. లేక జనాన్ని పక్కదారి పట్టించాలానో?) చేస్తున్నారు. కొన్ని సార్లు మాత్రం పద ప్రయోగంలోనో, లేక పలకడంలోనే తేడా కొట్టి కొన్ని సుభాషితాలు వల్లిస్తున్నారు.
ఇక ఈ మాటల విషయంలో టీడీపీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇది మానడం లేకపోగా.. మరింత పెరుగుతున్నాయంటున్నారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్. ఇటీవల అనంతపురంలో లోకేష్ చేసిన ప్రసంగాన్ని విశ్లేషించారు అమర్ దేవులపల్లి. ఇక నైనా ఇలాంటివి సవరించుకోకుంటే నవ్వుల పాలవుతారని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment