ప్రశ్నించడం పాపమైనచోటు
డేట్‌లైన్ హైదరాబాద్
రాజధాని భూసమీకరణ పేరిట తమ సన్నిహితులు దందాలు చేస్తున్నారని మీడియా చెపితే, రాష్ట్రం జ్వరంతో వణుకుతున్నది పట్టించుకోండి అంటే, ఎలుకలు కొరికి, చీమలు కరిచి పసి పిల్లలు చనిపోతున్నారు ప్రభుత్వ వైద్యశాలలను బాగుచేయండి అంటే కూడా మీడియాది ఉన్మాదమే. శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొనకూడదు అని చెప్పినా, ఓటు కోసం ఒక పక్క రాష్ట్ర శాసనసభ్యుడికి కోట్లు ఆశ జూపి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడినా విచారణను ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకోవడం సరైనది కాదు అని చెప్పినా మీడియాది ఉన్మాదమే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నోట ఇటీవల కాలంలో ఉన్మాదం అనే పదం పదే పదే వినిపిస్తున్నది. అది చాలా తీవ్రమ రుున పదం. ఆయనకు నచ్చనిదంతా ఉన్మాదమేనన్నది ప్రస్తుతం చంద్ర బాబునాయుడి సూత్రీకరణ. ఆయనా, ఆయన ప్రభుత్వంలోని వారూ, పార్టీ వారూ, ఆయనను సమర్థించేవారూ తప్ప ఆయన దృష్టిలో మిగిలినవారం దరూ ఉన్మాదులే. ప్రశ్నించే పాత్రికేయులు ఉన్మాదులు. ఆయన ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎత్తి చూపే మీడియా యాజమాన్యాలూ, అందులో పనిచేసే పాత్రికేయులూ అంతా ఉన్మాదులే. యజమానులు ధనార్జన పరులరుున ఉన్మాదులరుుతే, జర్నలిస్టులు జీతాలు తీసుకుని పనిచేసే ఉన్మాదులు. పాలనలో అవకతవకలనూ, అవినీతినీ ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల వారంతా కూడా ఉన్మాదులే. ఎదిరించి నిలబడే మేధావులు, పౌర సమాజం యావ న్మందీ ఉన్మాదులే.
చక్రవర్తి చంద్రబాబు
సింగపూర్‌లో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా 50 ఏళ్ల పాటు తమ ప్రభుత్వం ఉండాలన్న తన మనోగతాన్ని కొద్దిరోజుల క్రితమే చంద్రబాబు బహిర్గతం చేశారు. ‘ముఖ్యమంత్రి పదవి శాశ్వతం నాన్నా!’ అని ఆయన కుమారుడు లోకేశ్‌బాబు తన 13వ ఏటనే చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం అధినేత ఏకసూత్ర కార్యక్రమం ఏమిటంటే సింగపూర్‌లో వలెనే 50 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటం, తాను ముఖ్యమంత్రిగా కొనసాగటం. ఈ లెక్కన సుమారుగా 110 ఏళ్లు వచ్చేవరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న మాట. మొన్న శాసనసభ వర్షా కాల సమావేశాల చివరిరోజున మండలిలో మాట్లాడినప్పుడు తాను ఎంత ఆరోగ్యవంతుడో, ఆరోగ్యం కోసం ఎంత నిష్టగా ఉంటారో చెప్పారు. తన ఆహార వ్యవహారాల గురించి వివరంగానే తెలిపారు.
కాబట్టి చంద్రబాబు గారు 110 ఏళ్ల వరకూ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువే. కానీ ప్రజాస్వామ్య భారతదేశంలో మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం, ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల పేరిట ప్రజల దగ్గరికి వెళ్లాలి. వాళ్లు నచ్చితే ఓట్లేసి మళ్లీ గెలిపిస్తారు. లేదంటే ఇంటికి పంపేస్తారు. రాజనీతి కోవిదుడయిన చంద్రబాబు ఇవన్నీ తెలియకుండానే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారా? లేక తన మీద వచ్చే ఆరోపణల మీద విచారణలు జరగకుండా చీటికీ మాటికీ స్టేలు తెచ్చుకున్నట్టే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఓ 50 ఏళ్లు స్టే తెచ్చుకోగలమని అనుకుంటున్నారా? అది సాధ్యం కాదని ఆయనకు బాగా తెలుసు. గతంలో ఒకసారి ఆయనకు ఈ విషయంలో అను భవమయింది కూడా.
చంద్రబాబు 2020 కలను ప్రజలు 2004లో చెరిపేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రాష్ట్ర విభజన, మోదీ, పవన్‌కల్యాణ్‌ల పుణ్యమా అని 2014లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అనుకోకుండా చేజిక్కిన అధికారం చేజారిపోకుండా 50 ఏళ్ల పాటు ఉండాలంటే తమకు వ్యతిరేకంగా పోటీ చేసేవాడు ఉండకూడదు. విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో జాడ లేకుండాపోయింది. కమ్యూనిస్టుల బలం రోజు రోజుకూ తగ్గిపోతున్నది. సొంత బలం లేని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తమను కాదని వెళ్లే పరిస్థితి ఇప్పట్లో లేదు. రాదు. అప్పుడప్పుడు అమిత్‌షా చేసే ప్రకటనలు తమను ఏమీ చెయ్యలేవన్న ధీమా కూడా. ఇక మిగిలినవి ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీడియా. ఈ రెండింటినీ లేకుండా చేస్తే 50 ఏళ్లు అధికారంలో ఉండొచ్చునన్నది చంద్రబాబు ఆలోచన. మొన్న ఒక సమావేశంలో ఆయన ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమా, తమ్ముళ్లూ చెప్పండి!’ అన్నారు.
అక్కడ ఉన్నవాళ్లందరూ తెలుగు తమ్ముళ్లే కాబట్టి అవసరం లేదన్నారు. ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో కేవలం నాలుగు లక్షల ఓట్ల వ్యత్యాసంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఉండన వసరం లేదంటున్నారు. కాంగ్రెస్ కూడా అక్కరలేదట. సభలోని తెలుగు తమ్ముళ్లతో ఆ మాట కూడా అనిపించారాయన. ఒక రాజకీయ పార్టీ ఉండాలా, వద్దా అని నిర్ణరుుంచాల్సింది ప్రజలు కదా! పార్టీ మీటింగ్‌లో చేతులు ఎత్తించినంత మాత్రాన పార్టీలు ఉండకుండాపోతాయా? రాజకీయ పార్టీలు ఉండొద్దు. వ్యతిరేక వార్తలు రాసే మీడియా ఉండొద్దు. ప్రజాస్వా మ్యంలో విమర్శే వినిపించకూడదనే పాలకుడు మాట్లాడే మాటలను ఏమ నాలి? ప్రశ్నించేవాడే ఉండకూడదనే ఏలికను గురించి ఏమనుకోవాలి?
యావన్మందీ ఉన్మాదులే
ఏటా మూడు, నాలుగు పంటలు పండే అద్భుతమరుున వ్యవసాయ భూము లను రాజధాని నిర్మాణం కోసం సమీకరించడం సరికాదని రాసే పత్రికలది ఉన్మాదం. స్విస్ చాలెంజ్ పేరుతో విదేశీ సంస్థలకు భూములు అప్పజెప్పడం అన్యాయం అని రాస్తే ఉన్మాదం. విదేశీ ప్రయాణాలకూ, పుష్కరాలకూ మరింకేవో అనవసరం అరుున వాటికీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయవద్దంటే, ప్రత్యేక హోదా అనేది హక్కు, ప్యాకేజీ అనేది దయా ధర్మం మీద వచ్చేది అని చెబితే, పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌గా అంగీకరించి, దాని నిర్మాణ బాధ్యత రాష్ట్రానికి వదిలేసి, నిధులు తమ దోసిట్లో పోయాలని కోరుకోవడం తప్పు అంటే ఉన్మాదం. రాజధాని భూసమీకరణ పేరిట తమ సన్నిహితులు దందాలు చేస్తున్నారని మీడియా చెపితే, రాష్ట్రం జ్వరంతో వణుకుతున్నది పట్టించుకోండి అంటే, ఎలుకలు కొరికి, చీమలు కరిచి పసిపిల్లలు చనిపోతున్నారు ప్రభుత్వ వైద్యశాలలను బాగుచేయండి అంటే కూడా మీడియాది ఉన్మాదమే.
శాసనసభ్యులను సంతలో పశువుల్లా కొన కూడదు అని చెప్పినా, ఓటు కోసం ఒక పక్క రాష్ట్ర శాసనసభ్యుడికి కోట్లు ఆశ జూపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడినా విచారణను ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకోవడం సరరుునది కాదు అని చెప్పినా మీడియాది ఉన్మాదమే. ఒకటా రెండా, మీడియా ప్రభుత్వ వ్యతిరేక వార్త ఏది రాసినా అది ఉన్మాదం కిందకే వస్తుంది. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేక మీడియాను నిషేధిస్తే ఒక పని అయిపోతుంది కదా అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభిప్రాయం కావచ్చు. అక్కడక్కడా ఆయన అటువంటి ప్రకటనలు కూడా చేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక వార్తలే రాసే మీడియా కనుక లేకపోతే ప్రతిపక్షం పనిపట్టడం చాలా సులభం అన్నది అధినేత ఆలోచనలాగా ఉంది. ఎన్నికల హామీలు నెరవేర్చండి అని అడిగే ప్రతిపక్షం, మీడియా కూడా ఉండ కూడదన్నది ముఖ్యమంత్రి కోరిక. 2014 ఎన్నికల సమయంలో ఆయన ‘నౌ ఆర్ నెవర్’ (ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పుడూ కాదు ) అన్నట్టు ఎడాపెడా అలవికాని హామీలన్నీ గుప్పించారు. వాటిని అమలు చేయలేక సతమత మవుతూ మీడియానూ, ప్రతిపక్షాన్నీ ఉన్మాదులు అంటున్నారు. అట్లా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపులను బీసీల్లో చేర్చడం. హామీ నెరవేర్చు స్వామీ అని ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు ఉద్యమిస్తే, ఆ సందర్భంలో తునిలో ఒక రైల్‌ను దుండగులు తగులబెడితే ఆ నేరాన్ని ప్రధాన ప్రతిపక్షం మీదకు నెట్టే ప్రయత్నం ప్రభుత్వం, సాక్షాత్తు ముఖ్యమంత్రే చేస్తున్నారు. జనవరి 30న ఓ పక్క ముద్రగడ సభ జరుగుతుండగానే, తుని స్టేషన్‌లో రైలు బోగీలు తగలబడుతుండగానే విజయవాడలో ముఖ్యమంత్రి మీడియాను పిలిచి, ఇది రాయలసీమ నుండి వచ్చిన దుండగుల పనే అని తేల్చేస్తారు.
ప్రతిపక్ష నాయకుడే ఈ పని చేయించాడని ఆరోపిస్తారు. సంఘటన జరు గుతూ ఉండగానే, ప్రాథమిక దర్యాప్తు అరుునా జరగకుండానే నేరం ఎట్లా నిర్ధారిస్తారు అని అడిగిన మీడియా ఉన్మాది. ఈ సంఘటన మీద వేసిన సీఐడీ విచారణలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఇరికించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఆ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డిని కేసులో విచారణకు పిలిపించడం. ఈ వార్తా వ్యాఖ్య రాస్తున్న సమయానికి ఇంకా కరుణాకర్‌రెడ్డి గుంటూరులో సీఐడీ కార్యాలయంలో విచారణలో ఉన్నారు. ఆయన మీద అభియోగం మోపి అరెస్ట్ చేస్తారా, వదిలేస్తారా చూడాలి. అరుుతే నిన్న మొన్న ఈ కేసులో సీఐడీ విచారణకు హాజరయిన సుధాకర్ నాయుడు, మెహెర్ అనే వ్యక్తులు అధికారులకు ఏం చెప్పారో ఒక పత్రికలో వచ్చేసింది, అదెలా సాధ్య మని అంబటి రాంబాబు వంటి సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
తుని వ్యవహారంలో డబ్బులు హైదరాబాద్ నుండే వెళ్లాయనీ, డ్రోన్‌లు కూడా హైదరాబాద్‌లోనే కొన్నారనీ సుధాకర్‌నాయుడు చెపితే, కరుణాకర్‌రెడ్డి డబ్బు సమకూర్చినట్టు మెహెర్ చెప్పినట్టుగా ఆ పత్రిక ఒక వార్త ప్రచురించింది. సీఐడీ విచారణలో వాళ్లేం చెప్పారో అన్న విషయం ఈ పత్రిక ఎలా రాసింది అన్నది వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ప్రశ్న. కరుణాకర్‌రెడ్డిని ఇవ్వాళ అరెస్ట్ చెయ్యొచ్చు అని కూడా ఆ పత్రిక రాసింది. చేసినా చేయవచ్చు. బోగీలు ఇంకా తగలబడుతూ ఉండగానే ప్రతిపక్షానికీ, దాని నాయకుడికీ నేరం అంటగట్టిన ముఖ్యమంత్రి ఏలుబడిలో ఇది అసాధ్యం ఏమీకాదు.
అయినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ పత్రికలో విచారణ వార్త ఎట్లా వచ్చింది అని అడగ డంలో అర్ధంలేదు. జగన్‌మోహన్ రెడ్డిని జైలుకు పంపే క్రమంలో జరిగిన సీబీఐ విచారణ వార్తలే రోజూ కళ్లకు కట్టినట్టు లేదా విచారణాధికారి ప్రెస్ కాన్ఫరెన్ పెట్టి చెప్పినట్టు రాసిన ఘనత గల పత్రిక అది. సీఐడీ అనగా ఎంత? ఇది కూడా ముఖ్యమంత్రి తనను వ్యతిరేకించే మీడియాతో బాటు ప్రతిపక్షాన్ని కూడా లేకుండా చేసే ఆలోచనలో భాగమే అని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు గుర్తించాలి. ‘పత్రిక ఒక్కటున్న పదివేల సైన్యంబు పత్రిక ఒక్క టున్న మిత్రకోటి’ అని నార్ల వారు అన్నది ప్రజల తరఫున నిలబడటానికే గాని, ప్రభువుల కొమ్ము కాయడానికి కాదు అని ఆ పత్రిక యాజమాన్యానికి ఎవరు చెప్పాలి?
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com