నేను చాలా స్ట్రిట్టు..! | iam very strict officer kiran kumar speech in zp generel meeting | Sakshi
Sakshi News home page

నేను చాలా స్ట్రిట్టు..!

Published Fri, Jun 17 2016 2:14 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

నేను చాలా స్ట్రిట్టు..! - Sakshi

నేను చాలా స్ట్రిట్టు..!

‘నేను రోజుకు పది గంటలు పనిచేస్తున్నా.. నిన్న ఒక్క రోజే రూ.90లక్షల బిల్లులు పాస్ చేశా. ఒక్క పైసా బాకీ లేదు. నా గురించి ఎవరో తప్పుగా చెప్తున్నరు..’ అంటూ పరిగి గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ కిరణ్ కుమార్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ విభాగానికి సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఆయన జోక్యం చేసుకుంటూ పైవిధంగా స్పందించారు.

ఈ క్రమంలో ఆయన తడబాటు.. చెప్పిన విషయాన్నే పదేపదే చెప్పడం.. పైఅధికారులు వారిస్తున్నా వినకుండా కొంత దూకుడుగా వ్యవహరించడంతో.. మద్యం సేవించి వచ్చారా సార్.. అంటూ సభ్యులు సెటైర్లు విసిరారు. ఇంతలో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ఆయన ఆరోగ్యం బాలేదంటూ వెనకేసుకొచ్చారు. అయినప్పటికీ.. ఈఈ వ్యవహారశైలిపై విచారణ చేపట్టాలని కలెక్టర్ అంతర్గతంగా ఆదేశించినట్లు తెలిసింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement