‘ప్రజలకు అందుబాటులో న్యాయ సేవలు’ | Legal services available to the public | Sakshi
Sakshi News home page

‘ప్రజలకు అందుబాటులో న్యాయ సేవలు’

Published Sun, Jun 22 2014 2:06 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

‘ప్రజలకు అందుబాటులో న్యాయ సేవలు’ - Sakshi

‘ప్రజలకు అందుబాటులో న్యాయ సేవలు’

 నిజామాబాద్ లీగల్/నందిపేట/నవీపేట : ప్రజలకు న్యాయ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చామని జిల్లా అడిషనల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కిరణ్ కుమార్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాధాకృష్ణ చౌహాన్ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ మండలంలోని కాలూర్‌లో, మాక్లూర్‌లో, నవీపేట మండల పరిషత్ కార్యాలయంలో న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించారు. కార్యక్రమాల్లో వారు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్టాలపై అవగాహన లేకే ప్రజలు అన్యాయాలకు గురవుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
 
లక్షలోపు వార్షిక ఆదాయమున్న నిరుపేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నామన్నారు. మహిళలు, వృద్ధులు, నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను ఏర్పాటు చేశామన్నారు. మాక్లూర్ మండలంలో సివిల్ కేసుల పరిష్కారానికి న్యాయవాది రవికుమార్‌ను, క్రిమినల్ కేసుల పరిష్కారానికి స్థానిక ఎస్సై సంతోష్‌కుమార్‌లను సంప్రదించాలని సూచించారు.
 
చదువుకు దూరమై వీధులలో తిరుగుతున్న బాలలను బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించా రు. 14 ఏళ్లలోపు వారిని పనిలో పెట్టుకోవడం నేరమని, దీనికి కఠి న శిక్షలుంటాయని హెచ్చరించా రు. ఈ సందర్భంగా మాక్లూర్‌లో సర్పంచ్ సత్యమ్మ న్యాయమూర్తుల ను సన్మానించారు. సీఐలు దామోదర్‌రెడ్డి, యాదిరెడ్డి, ఎస్సై సంతోష్‌కుమార్, జడ్పీటీసీ సభ్యులు లతా పీర్‌సింగ్, డీసీసీబీ డెరైక్టర్ పీర్‌సింగ్, ఎంపీటీసీ సభ్యుడు హైమద్, నవీపేట మండల లీగల్ ఆర్గనైజర్ కిషన్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావ్, ఇన్‌చార్జి తహశీల్దార్ రమేశ్, ఎస్సై సంపత్ కుమార్, సర్పంచ్ కపిల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement