చంద్రయాన్-2 మిషన్‌ను 2018 ప్రథమార్ధంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. వెల్స్ విశ్వవిద్యాలయ 7వ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన చంద్రునిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను దింపేందుకు అవసరమయ్యే సాంకేతికతపై ప్రస్తుతం టెస్టులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఇస్రో ప్రత్యేక ఇంజిన్‌ను తయారుచేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఓ కృత్రిమ కార్టర్‌తో ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహేంద్రగిరి, తిరెనెల్‌వేలి, చల్లకెరెల్లో గల ఇస్రో స్ధావరాల్లో గ్రౌండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.