ఆఘమేఘాలపై కొత్త భవనాల ప్రారంభోత్సవం
పేరు కోసమేనా ఈ తొందర
సీఈ సాంబయ్య వైఖరిపై విమర్శలు
సాక్షి, విజయవాడ : ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ కృష్ణా ఇరిగేషన్ సర్కిల్‌లో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ప్రారంభించేందుకు అధికారులు హడావుడి పడుతున్నారు. ఎన్నికల ముందు పూర్తికాని పులిచింతల ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేస్తే, ఇప్పుడు ఈ భవనాలను మరో రెండువారాల్లో పదవీ విరమణ చేసే చీఫ్ ఇంజినీర్ ప్రారంభించడానికి చూడటం వివాదాలకు దారి తీ స్తోంది.
ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 16న కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇది జరగడానికి వారం రోజులు మాత్రమే గడువు ఉన్న సమయంలో హడావుడిగా ఈ భవనాన్ని ప్రారంభిం చేందుకు చీఫ్ ఇంజినీర్ సాంబయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాదిలో రిటైర్ అయిన సాంబయ్య ఇప్పటికే రెండుసార్లు తన పదవీ కాలాన్ని పొడిగించుకున్న సంగతి తెలిసిందే. ఈ పదవీ కాలం కూడా ఈ నెలాఖరుకు ముగుస్తుంది.
కొత్త రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో ఈ భవనాన్ని కొత్త పాలకులతో ప్రారంభింపచేస్తే బాగుంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. కృష్ణాసర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కార్యాలయ భవనాలను బ్రిటీష్ హయాంలో నిర్మిం చారు. కృష్ణాడెల్టా ఆధునీకరణలో భాగంగా చీఫ్ ఇంజినీర్, ఎస్‌ఈ, కృష్ణా తూర్పు, కృష్ణా సెంట్రల్, స్పెషల్ డివి జన్ ఈఈ కార్యాలయాల కోసం పాత భవనాల స్థానం లో మళ్లీ భవనం నిర్మించాలని భావిం చారు. దీని కోసం రూ.3 కోట్లతో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈపీసీ పద్ధతిలో భవనం నిర్మిం చాల్సి ఉంది.
భవనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో నెల పడుతుంది. పనులన్నీ పూర్తయ్యాకే ఈ భవనాలను కాంట్రాక్టర్ ఇరిగేషన్ శాఖకు అప్పగిస్తారు. అయితే తన హయాంలో ప్రారంభించాలని చీఫ్ ఇంజినీర్ డి. సాంబయ్య నిర్ణయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా కాంట్రాక్టర్‌పై ఒత్తిడితెచ్చి ఆగమేఘాలపై పనులు చేస్తున్నారు. ఈ నెల 14న రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయాలని సీఈ నిర్ణయించారు. ఈ నిర్ణయంపై సర్కిల్ అధికారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నెల 19 వరకూ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ తరుణంలో హడావుడిగా తీసుకునే నిర్ణయం వల్ల తనకు ఇబ్బంది వస్తుందని ఎస్‌ఈ శ్రీనివాసరావు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు తెలిసింది. ఈ భవనాన్ని కొత్త ప్రభుత్వంలో సీఎం లేదా ఇరిగేషన్ మంత్రి ప్రారంభిస్తే బావుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సీఈ సాంబయ్య కొత్త రాష్ట్రం లో తన పేరు కోసం హడావుడి చేస్తే చూస్తూ సహించబోమని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఈ సాం బయ్య దృష్టికి తీసుకువెళ్లామని, మొండిగా ప్రారంభోత్సవానికి సిద్ధపడితే అడ్డుకుంటామని హెచ్చరి స్తున్నారు. మరో వైపు ఈ భవనాలను నాసిరకంగా నిర్మించారని, వర్షం వస్తే నీరంతా లోపలే ఉంటోందని ఉద్యోగులు చెబుతున్నారు.
సర్కిల్ కార్యాల యంలో నిర్మించిన ఈ భవనానికి మోపిదేవిలో పనిచేసే అసిస్టెంట్ ఇంజినీర్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేసిన గత ఎస్‌ఈ నరసింహమూర్తి కొంతకాలం పనులు నిలుపుదల చేశారు. ఐతే పైఅధికారి నుంచి ఒత్తిడి తెచ్చి ఈ పనులను పూర్తి చేయిస్తున్నట్లు సమాచారం.
కోడ్ ఉల్లంఘన..!!
Published Sat, May 10 2014 12:57 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement