
సాక్షి, విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం రేపటి(శుక్రవారం) నుంచి రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనుంది. రెండు రోజుల పాటు సీఎస్, డీజీపీలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ బృందం సమావేశం కానుంది.
వివరాల ప్రకారం.. ఏపీలో రెండు రోజుల పాటు కేంద్రం ఎన్నికల బృందం పర్యటించనుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్ సహా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్‌లతో కూడిన ఏడుగురు సభ్యులు బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. రెండు రోజుల పాటు 2024 ఓటర్ల జాబితాల రూపకల్పనతో పాటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఈసీ బృందం సమీక్షించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై కలెక్టర్లు నివేదికలు సమర్పించనున్నారు. ఈ నెల 23వతేదీన సీఎస్, డీజీపీలతో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది. మరోవైపు.. విజయవాడలోని నోవాటెల్‌లో ఏర్పాట్లని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ముకేష్ కుమార్ మీనా పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment