సాక్షి, తిరుపతి: పీలేరులో నల్లారి సోదరుల మధ్య పోరు ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో వీరి మధ్య పోటీ తప్పదని స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నా, వచ్చే ఎన్నికల్లో కిశోర్‌కుమార్ రెడ్డి అన్నకు మద్దతుగా ఉంటారని ఆయన వర్గీయులు భావించారు. తిరుపతిలో సోమవారం నల్లా రి కిశోర్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులకు ఆగ్రహం తెప్పించాయి. పీలేరు బరిలో తాను టీడీపీ అభ్యర్థిగా ఉంటానని, ఎవరి మీదైనా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. సొంత అన్న అయినా పోటీ చేసి తీరుతానని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కిరణ్‌కుమార్ రెడ్డి పోటీ చేస్తే తప్పుకుంటారా? అని విలేకరులు కిశోర్‌ని ప్రశ్నించారు. ఎవరు పోటీ చేసినా.. చేయకపోయినా తాను టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానన్నారు. కిశోర్ మాటలు ఆయన సోదరుడి వెంట ఉన్నవారిని కంగు తినిపిం చాయి. కిరణ్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా... సీఎం అయినా పెత్తనం అంతా తమ్ముడికే అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. షాడో సీఎంగా చెలామణి కావడానికి కారణమైనవారెవరో తెలుసుకోవాలని కిరణ్ వర్గీయులంటున్నారు.
అన్నకు కిశోర్ వెన్నుపోటు
సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి ఉన్నా...అభివృద్ధి చేసిందంతా తానేనని కిశోర్‌కుమార్‌రెడ్డి .. ఆయన అనుచరులు, నియోజక వర్గంలో చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కిరణ్ వర్గీయులకు చేరినట్లు సమాచారం. ప్రస్తుతం పదవుల కోసం టీడీపీలో చేరినా... వచ్చే ఎన్నికల్లో అన్న కిరణ్‌కు అండగా నిలబడతారని మాజీ సీఎం వర్గీయులు ఇన్నాళ్లూ మిన్నకుండిపోయారు. కిశోర్ తన సిసలైన వైఖరి బట్టబయలు చేశారు. దీనిపై కిరణ్ వర్గీయులు మండిపడుతున్నట్లు భోగట్టా. చంద్రబాబు పంచన చేరి ఆయన బుద్ధులే వచ్చాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచినట్లు... నీవు అన్నకు వెన్నుపోటు పొడుస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో అక్రమాలు చేస్తున్నా పట్టించుకోలేదని కిరణ్ వర్గీయులంటున్నారు. ఎన్ని చేసినా అన్నకు అండగా ఉంటారని భావించామని కిరణ్ వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీలో చేరాక స్వార్థం చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న ఉన్న సమయంలో, ప్రస్తుతం చేస్తున్న అక్రమాలన్నీ తొందర్లోనే బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. ‘నీకు దమ్ముంటే... మేము చేసిన అక్రమాలను నిరూపించు’ అని కిరణ్ వర్గీయులు సవాల్ విసురుతున్నారు. కిశోర్ వర్గీయులు కూడా తాము తక్కువేం కాదంటూ... కిరణ్‌కుమార్ రెడ్డిని, ఆయన అనుచరులను టార్గెట్ చేస్తూ వ్యతిరేకంగా ప్రచారం చేయటం ప్రారంభించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment