Kishor Kumar
-
మారు వేషంలో ధరలు తెలుసుకున్న జేసీ!
సాక్షి, విజయనగరం: లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల వ్యాపారులు కొందరు ధరలు పెంచేస్తున్నారు. దీంతో కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజల జేబులకు చిల్లులు తప్పడం లేదు. అయితే, అధిక ధరలు వసూలు చేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ వినూత్న ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాజీవ్ మైదానంలో ఏర్పాటు చేసిన పలు కూరగాయల మార్కెట్లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. కొందరు వ్యాపారులు నిత్యావసరాలు, కూరగాయల్ని రూ.5 ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించారు. అనంతరం అధికారులతో చర్చించి.. రేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జేసీ మారు వేషంలో వచ్చింది తెలుసుకుని వ్యాపారులు షాకయ్యారు. (చదవండి: ‘వృద్ధులు, పిల్లలు ఏమాత్రం బయటకు రావొద్దు’) (చదవండి: ఏపీలో 87కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు) -
‘నల్లారి కిశోర్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి’
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో టీడీపీ నాయకుల అరాచకాలను నిలదీసేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం చిత్తూరు జిల్లాలోని కలికిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని, ఆయనకు బుద్ధి చెప్పాలంటే.. అందుకు సరైన ఆయుధం ప్రజల చేతిలోనే ఉందని, ప్రజలు ఓటుతో ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు ప్రజాప్రతినిధులు అయితే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. టీడీపీ నేతలు అధికారదర్పం ప్రదర్శిస్తూ కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ బాలయ్యకుంట గ్రామస్తులకు నరకం చూపిస్తున్నారని, గ్రామస్తులు వైఎస్సార్సీపీలో చేరవద్దంటూ కిశోర్‌కుమార్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ సభలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఇక్బాల్ అహమ్మద్, కారపకుల భాస్కర్ నాయుడు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
పీలేరులో అన్నదమ్ముల సవాల్..
సాక్షి, తిరుపతి: పీలేరులో నల్లారి సోదరుల మధ్య పోరు ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో వీరి మధ్య పోటీ తప్పదని స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నా, వచ్చే ఎన్నికల్లో కిశోర్‌కుమార్ రెడ్డి అన్నకు మద్దతుగా ఉంటారని ఆయన వర్గీయులు భావించారు. తిరుపతిలో సోమవారం నల్లా రి కిశోర్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గీయులకు ఆగ్రహం తెప్పించాయి. పీలేరు బరిలో తాను టీడీపీ అభ్యర్థిగా ఉంటానని, ఎవరి మీదైనా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. సొంత అన్న అయినా పోటీ చేసి తీరుతానని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కిరణ్‌కుమార్ రెడ్డి పోటీ చేస్తే తప్పుకుంటారా? అని విలేకరులు కిశోర్‌ని ప్రశ్నించారు. ఎవరు పోటీ చేసినా.. చేయకపోయినా తాను టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానన్నారు. కిశోర్ మాటలు ఆయన సోదరుడి వెంట ఉన్నవారిని కంగు తినిపిం చాయి. కిరణ్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా... సీఎం అయినా పెత్తనం అంతా తమ్ముడికే అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. షాడో సీఎంగా చెలామణి కావడానికి కారణమైనవారెవరో తెలుసుకోవాలని కిరణ్ వర్గీయులంటున్నారు. అన్నకు కిశోర్ వెన్నుపోటు సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి ఉన్నా...అభివృద్ధి చేసిందంతా తానేనని కిశోర్‌కుమార్‌రెడ్డి .. ఆయన అనుచరులు, నియోజక వర్గంలో చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం కిరణ్ వర్గీయులకు చేరినట్లు సమాచారం. ప్రస్తుతం పదవుల కోసం టీడీపీలో చేరినా... వచ్చే ఎన్నికల్లో అన్న కిరణ్‌కు అండగా నిలబడతారని మాజీ సీఎం వర్గీయులు ఇన్నాళ్లూ మిన్నకుండిపోయారు. కిశోర్ తన సిసలైన వైఖరి బట్టబయలు చేశారు. దీనిపై కిరణ్ వర్గీయులు మండిపడుతున్నట్లు భోగట్టా. చంద్రబాబు పంచన చేరి ఆయన బుద్ధులే వచ్చాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచినట్లు... నీవు అన్నకు వెన్నుపోటు పొడుస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో అక్రమాలు చేస్తున్నా పట్టించుకోలేదని కిరణ్ వర్గీయులంటున్నారు. ఎన్ని చేసినా అన్నకు అండగా ఉంటారని భావించామని కిరణ్ వర్గీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీలో చేరాక స్వార్థం చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న ఉన్న సమయంలో, ప్రస్తుతం చేస్తున్న అక్రమాలన్నీ తొందర్లోనే బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. ‘నీకు దమ్ముంటే... మేము చేసిన అక్రమాలను నిరూపించు’ అని కిరణ్ వర్గీయులు సవాల్ విసురుతున్నారు. కిశోర్ వర్గీయులు కూడా తాము తక్కువేం కాదంటూ... కిరణ్‌కుమార్ రెడ్డిని, ఆయన అనుచరులను టార్గెట్ చేస్తూ వ్యతిరేకంగా ప్రచారం చేయటం ప్రారంభించడం గమనార్హం. -
కిషోర్ దా
-
బహుముఖప్రజ్ఞాశాలి కిషోర్‌కుమార్‌కు గూగుల్ నివాళి
బహుముఖప్రజ్ఞాశాలి కిషోర్ కుమార్‌కు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఘన నివాళి అర్పించింది. గూగుల్ అనే ఆరు ఇంగ్లీష్ అక్షరాలలో ఎల్ స్థానంలో కిషోర్ కుమార్ ఫొటోను ఉంచి ఆయనకు తగిన గౌరవాన్ని అందించింది. ఎక్కవ మందికి గాయకుడిగా మాత్రమే తెలిసిన కిషోర్ కుమార్‌కు సినిమా రంగంలోని 24 శాఖలలో అవగాహన ఉంది. 'ట్రాజెడీ కింగ్' గా ప్రసిద్ధిగాంచిన కిషోర్ కుమార్ బాలీవుడ్లో నటుడు, నేపథ్యగాయకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, పాటల రచయిత, హాస్యం, డబ్బింగ్ ఆర్టిస్ట్...ఒకటేమిటి అన్నిరంగాలలో తన ప్రతిభను కనపరచి ప్రేక్షకులను రంజింపజేశారు. అశోక్ కుమార్, అనూప్ కుమార్ల ముద్దుల తమ్ముడైన కిషోర్ కుమార్ 1929 ఆగష్టు 4న ఖాండ్వా గ్రామంలో జన్మించారు. హిందీ చిత్రరంగంలో హెమాహెమీలైన సంగీత దర్శకులు అందరూ అందరి హీరోలకు కిషోర్ చేత పాడించారు. కిషోర్ ఎన్నో మధుర గీతాలు ఆలపించారు. అయితే రాజేష్ ఖన్నా-కిషోర్ కాంబినేషన్లో పాడిన పాటలకు అత్యధిక ప్రజాదరణ లభించింది. ఆర్డి బర్మన్-కిషోర్ కుమార్ కాంబినేషన్లో మహాఅద్బుత గీతాలు సృష్టి జరిగింది. "చల్తీకా నాం గాడీ" చిత్రంలో అన్నదమ్ములు అశోక్, అనూప్, కిషోర్ ముగ్గురూ నటించారు. ఈ చిత్రంలో కిషోర్ పాటలు దేశమంతటా మారుమ్రోగాయి. ఇంతటి గాయకుడు అందుకున్న పురస్కారాల జాబితా ఎంత ఉంటుందో అర్ధం చేసుకుకోవచ్చు. కిషోర్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. రుమాదేవి,మధుబాల, యోగితా బాలి,లీనా చందావర్కర్లు ఆయన భార్యలే. 1987 అక్టోబరు 13వ తేది. ఆ రోజు దీపావళి. ఆ రోజునే కిషోర్ మరణించారు. అదే రోజు అతని సోదరుడు అశోక్ కుమార్ పుట్టిన రోజు. అప్పటి నుంచి అశోక్‌కుమార్ దీపావళి గానీ, పుట్టిన రోజును గానీ జరుపుకోలేదు. కిషోర్ మరణించి 35 ఏళ్లు దాటి పోయింది. బాలీవుడ్లో ఆ ఖాళీని ఎవరూ పూరించలేకపోయారు. ఇక ముందు కూడా ఆ అవకాశంలేదు. - శిసూర్య -
హైదరాబాద్‌లోనే విద్య, ఉద్యోగ అవకాశాలు:కిషోర్ కుమార్
హైదరాబాద్ : విద్య, ఉద్యోగ అవకాశాలు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేత కిషోర్ కుమార్ అన్నారు. ఎల్బి స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.