సాక్షి, విజయనగరం: లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల వ్యాపారులు కొందరు ధరలు పెంచేస్తున్నారు. దీంతో కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజల జేబులకు చిల్లులు తప్పడం లేదు. అయితే, అధిక ధరలు వసూలు చేయకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ వినూత్న ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాజీవ్ మైదానంలో ఏర్పాటు చేసిన పలు కూరగాయల మార్కెట్‌లలో సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. కొందరు వ్యాపారులు నిత్యావసరాలు, కూరగాయల్ని రూ.5 ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించారు. అనంతరం అధికారులతో చర్చించి.. రేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. జేసీ మారు వేషంలో వచ్చింది తెలుసుకుని వ్యాపారులు షాకయ్యారు.
(చదవండి: ‘వృద్ధులు, పిల్లలు ఏమాత్రం బయటకు రావొద్దు’)
(చదవండి: ఏపీలో 87కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు)
మారు వేషంలో విజయనగరం జాయింట్ కలెక్టర్
Published Wed, Apr 1 2020 12:43 PM | Last Updated on Wed, Apr 1 2020 12:53 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment