![Heavy Crowd In Front Of bank Without Mask And Distance In Vizianagaram - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/5/1_1.jpg.webp?itok=x5dA9iGw)
బ్యాంక్ లోపల కిటకిట
సాక్షి, విజయనగరం: ఎస్ కోటలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరో పక్క మరణాలు కూడా నమోదవుతూనే ఉన్నాయి. అయినా ప్రజలు మాత్రం తమ అవసరాల ముసుగులో కరోనాను మరిచిపోతున్నారు. పట్టణంలోని ప్రధాన బ్యాంకులన్నీ కోవిడ్ వ్యాపిత కేంద్రాలుగా మారుతున్నాయి. సోమ, మంగళవారాల్లో బ్యాంకులకు ఖాతాదారులు పోటెత్తారు. కనీసం మాస్క్ పెట్టుకోకుండా.. భౌతికదూరం పాటించకుండా ఒకేదగ్గర గుమిగూడడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ, తదితర బ్యాంక్ శాఖలు రద్దీగా కనిపించాయి. ఇలా అయితే కరోనా వ్యాపించదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
చదవండి: Corona: చిన్న ఊరు.. నిశ్చింతగా ఉన్నారు
ఎస్.కోట యూనియన్ బ్యాంక్ ఎదుట ఉన్న జనం
Comments
Please login to add a commentAdd a comment