చంద్రయాన్-2 సిద్ధమౌతోంది: కిరణ్‌కుమార్
చంద్రయాన్-2 మిషన్‌ను 2018 ప్రథమార్ధంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు.
న్యూఢిల్లీ: చంద్రయాన్-2 మిషన్‌ను 2018 ప్రథమార్ధంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. వెల్స్ విశ్వవిద్యాలయ 7వ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన చంద్రునిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను దింపేందుకు అవసరమయ్యే సాంకేతికతపై ప్రస్తుతం టెస్టులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఇస్రో ప్రత్యేక ఇంజిన్‌ను తయారుచేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఓ కృత్రిమ కార్టర్‌తో ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహేంద్రగిరి, తిరెనెల్‌వేలి, చల్లకెరెల్లో గల ఇస్రో స్ధావరాల్లో గ్రౌండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు ఉపగ్రహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వీనస్ మిషన్‌పై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ప్రాజెక్టుపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని చెప్పారు. కాగా, చంద్రయాన్ 2లో ఒక ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ కాన్ఫిగరేషన్ ఉంటాయి. చంద్రయాన్-1కి ఇది ఆధునిక వెర్షన్. జీఎస్‌ఎల్వీ మార్క్ 2 ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించాలనే ఇస్రో చూస్తోంది.