
కిరణ్ వల్లే కాంగ్రెస్ నాశనమైంది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వల్లే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. కిరణ్ను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేదిలేదని చెప్పారు.
సీమాంధ్రలో కిరణ్ మినహా కాంగ్రెస్ను వీడిన నేతలందరూ మళ్లీ పార్టీలోకి రావాలని వీహెచ్ కోరారు. మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సబ్బం హరి కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానించారు. ఈ నేతలతో ఇప్పటికే తాను మాట్లాడానని వీహెచ్ చెప్పారు.