అనంతపురం అగ్రికల్చర్: కళ్యాణదుర్గం భూసంరక్షణా విభాగంలో పనిచేస్తున్న వ్యవసాయాధికారి (ఏఓ) కె.కిరణ్‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. బ్రహ్మసముద్రం మండలానికి ఇన్‌చార్జ్ ఏఓగా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ విత్తన పంపిణీతో ఇతర వ్యవసాయ పథకాల అమలులో తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నందున ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.