వేలాది రూపాయల శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది.
కోల్ కతా: వేలాది రూపాయల శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు చార్జీషీట్ సమర్పించింది. సుదీప్తసేన్, ఆయన సన్నిహితుడు దేబజాని ముఖర్జీ, బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ పేర్లు చార్జీషీట్ లో ఉన్నాయి. నాలుగు శారదా గ్రూపు సంస్థలు, స్ట్రటజీ మీడియాపై అభియోగాలు మోపారు.
భారత శిక్షా స్మృతిలోని 120బీ, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. శారదా కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత 2013 ఏప్రిల్ లో జమ్మూకాశ్మీర్ లో సేన్, ముఖర్జీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.