Sudipta Sen
-
తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ డైరెక్టర్!
ఆదాశర్మ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సుదీప్తో సేన్ ఆస్పత్రిలో చేరారు. విరామం లేకుండా ప్రయాణాలు చేయడం వల్లే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమాపై నిరసనలు వస్తున్నప్పటికీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. (ఇది చదవండి: బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!) మే 5న విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్కును అధిగమించింది. అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చేరిన సుదీప్తో సేన్ కొన్ని ప్రచార కార్యక్రమాలకు విరామం ప్రకటించారు. ఈ చిత్రంలో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళకు చెందిన అమ్మాయిలు బలవంతంగా ఐసిస్‌లో చేరారన్నకథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. (ఇది చదవండి: సొంతింటి కల సాకారం చేసుకున్న రీతూ చౌదరి) -
'శారదా' కుంభకోణంలో తొలి చార్జిషీట్
కోల్ కతా: వేలాది రూపాయల శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు చార్జీషీట్ సమర్పించింది. సుదీప్తసేన్, ఆయన సన్నిహితుడు దేబజాని ముఖర్జీ, బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ పేర్లు చార్జీషీట్ లో ఉన్నాయి. నాలుగు శారదా గ్రూపు సంస్థలు, స్ట్రటజీ మీడియాపై అభియోగాలు మోపారు. భారత శిక్షా స్మృతిలోని 120బీ, 409, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. శారదా కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత 2013 ఏప్రిల్ లో జమ్మూకాశ్మీర్ లో సేన్, ముఖర్జీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కొట్టేసిన సొమ్ముతో బ్యాంక్ లైసెన్స్ కు యత్నం!
న్యూఢిల్లీ: ‘శారద కుంభకోణం’లో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే శారదా గ్రూప్ అధినేత సుదీప్తసేన్ ను విచారిస్తున్నఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి మరిన్ని ఆధారాలు లభించాయి. వివిధ రకాల పథకాల పేరుతో ఇన్వెస్టర్లను వేలాది కోట్ల రూపాయల మేర మోసగించిన సుదీప్తసేన్... బ్యాంక్ లైసెన్స్ కూడా సంపాదించడానికి ప్రయత్నించాడట. ఇందుకు తగిన ప్రణాళిక కూడా రచించుకుని అందుకు అనుగుణంగానే పావులు కదిపినట్లు తాజా సోదాల్లో బయటపడింది. ఇందుకు మూలధనంగా ఇన్వెస్టర్ల నుంచి కొల్లగొట్టిన నిధుల్లోంచి రూ.1,000 వెయ్యి కోట్లకు పైగా వినియోగించాలని సుధీప్తసేన్ నిర్ణయించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. అయితే, గతేడాది ప్రారంభంలో స్కామ్ వెలుగు చూడడంతో బ్యాంక్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవడం ఆగిపోయిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.2013 ఫిబ్రవరిలో కొత్త బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించిన విధివిధినాలను ఆర్బీఐ సూచించడంతో అతని లైసెన్స్ కు గండిపడింది. ఇదిలా ఉండగా శారదా స్కాంకు సంబంధించి పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ఆపార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పాత్ర ఉందని ఆయన విమర్శించారు.