సాక్షి, హైదరాబాద్: మాంసం వ్యాపారి ఖురేషి వ్యవహారంలో ఈడీ చార్జిషీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎంబీఎస్ జ్యువెలర్ సుఖేష్ గుప్తాకు బెయిల్ డీల్ వ్యవహారంలో సీబీఐ మాజీ డైరెక్టర్ ద్వారా ఖురేషీ సాగించిన వ్యవహారం వెలుగులోకి రావడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఖురేషీ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతల పేర్లు ప్రస్తావించడం రాజకీయంగా కలవరం సృష్టిస్తోంది.
సుఖేష్ గుప్తాకు బెయిల్ ఇప్పించే విషయంలో ఖురేషితో ఒప్పందం నడిపించినట్లు ఈడీ విచారణలో కోనేరు ప్రదీప్ బయటపెట్టడం, పలువురు రాజకీయ నేతల ద్వారా సీబీఐ మాజీ డైరెక్టర్‌ను కలసి ఖురేషి చర్చించిన అంశాలను చార్జిషీట్‌లో ఈడీ పేర్కొనడం సంచలనం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment