కాంగ్రెస్‌ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జీషీట్‌ | BJP Releases Chargesheet On Congress Govt One Year Rule | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జీషీట్‌

Published Sun, Dec 1 2024 3:31 PM | Last Updated on Sun, Dec 1 2024 4:44 PM

BJP Releases Chargesheet On Congress Govt One Year Rule

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. 6 అబద్ధాలు.. 66 మోసాలు.. పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఛార్జీషీట్‌ను విడుదల చేశారు. ఎంపీలు డికె అరుణ, రఘునందన్ రావు, నగేష్, బీజే ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే లు హరీష్ బాబు, పైడి రాకేశ్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి పలువురు  హాజరయ్యారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు అందలేదన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మోసపూరిత హామీలపైనే మా పోరాటం అని.. ప్రజల తరపున ఛార్జ్‌షీట్‌ రూపంలో ప్రభుత్వం ముందు పెట్టామని కిషన్‌రెడ్డి అన్నారు.

‘‘కాంగ్రెస్‌ విజయోత్సవాలను చూసి  ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. వందరోజుల్లో హామీలు పూర్తి చేస్తామన్నారు. ఏడాదైంది. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు, ఏడాది కాంగ్రెస్‌ పాలనకు ఏం తేడా లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాపై ఉంది. ప్రజలను నమ్మించడం కోసం దేవుడిపై ఒట్లు పెట్టారు. రుణమాఫీ ఇప్పటివరకు కొంతమంది రైతులకే జరిగింది. ఏడాది పూర్తయింది.. రైతు భరోసా ఎక్కడ?’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement