సమాచార హక్కు కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో గుజరాత్కు చెందిన బీజేపీ లోక్సభ సభ్యుడు దినూ బోఘా సోలంకిపై సీబీఐ హత్యాభియోగాన్ని మోపింది.
గుజరాత్: సమాచార హక్కు కార్యకర్త అమిత్ జెత్వా హత్య కేసులో గుజరాత్కు చెందిన బీజేపీ లోక్సభ సభ్యుడు దినూ బోఘా సోలంకిపై సీబీఐ హత్యాభియోగాన్ని మోపింది. జునాగఢ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనపై నేరపూరిత కుట్ర అభియోగాన్ని నమోదు చేసింది. ఆసియా సింహాలకు కొలువైన గిర్ అడవుల్లో అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా పోరాడిన అమిత్ 2010 జూలైలో గుజరాత్ హైకోర్టు వెలుపల హత్యకు గురైయ్యారు.ఈ కేసుకు సంబంధించి శనివారం అహ్మదాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసింది.