ఢిల్లీ అల్లర్లు: 'వాట్సాప్‌ గ్రూప్‌'పై కేసు | WhatsApp Group Promoting Enmity, Delhi Riots Charge Sheet | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అల్లర్లు: 'వాట్సాప్‌ గ్రూప్‌'పై కేసు

Published Wed, Oct 7 2020 2:07 PM | Last Updated on Wed, Oct 7 2020 4:22 PM

WhatsApp Group Promoting Enmity, Delhi Riots Charge Sheet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మత విద్వేషాలను రెచ్చగొడుతున్న ఓ వాట్సాప్‌ గ్రూప్‌ నిర్వహకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'కట్టర్‌ హిందూ ఏక్తా' పేరుతో ఉన్న ఈ గ్రూప్‌లో మెసేజులు, ఫొటోలను పరిశీలించిన పోలీసులు.. మరో మతానికి వ్యతిరేకంగా ఈ గ్రూప్‌ పనిచేస్తోందని గుర్తించారు. ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయాలని ఈ గ్రూప్‌ వేదికగా ప్లాన్‌ చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ వివరాలను సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో పొందుపరిచి కోర్టుకు నివేదించారు. 

ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరి 24న పెద్ద ఎత్తును మత ఘర్షణలు జరిగిన మరుసటి రోజే ఈ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఆ మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 751 ఎఫ్ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. 1571 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 250 చార్జ్‌షీట్లు నమోదు చేసి 1153 మందిని నిందితులుగా చేర్చారు. (చదవండి: ఢిల్లీ అల్లర్లు: చార్జిషీట్‌లో సల్మాన్‌ ఖుర్షీద్‌ పేరు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement