న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ రెండో ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. మద్యం పాలసీ విధానం, రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయని తెలిపింది. టెండర్ల తర్వాత ప్రైవేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చినట్లు పేర్కొంది.
లిక్కర్ స్కాంకు సంబంధించి ఇప్పటివరకు ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, ముంబై, హైదరాబాద్ , లక్నో బెంగళూరులో సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. పలు కీలక డాక్యుమెంట్లు, వస్తువులు, డిజిటల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఈ కేసులో ఒక ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, కొత్తగా లభించిన ఆధారాలతో రెండో ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు సీబీఐ వివరించింది. కాగా.. ఈ ఛార్జ్‌షీట్‌లో మనీశ్ సిసోడియాతో పాటు హైదరాబాద్‌కు చెందిన బుచ్చిబాబు గోరంట్ల, లిక్కర్ వ్యాపారి అమన్‌దీప్ సింగ్ ధాల్, అర్జున్ పాండే పేర్లను కూడా చేర్చింది.
చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం?
Comments
Please login to add a commentAdd a comment