
ఆర్థిక నేరగాడు, పీఎన్‌బీ కుంభకోణంలో కీలక నిందితుడు మొహుల్ చోక్సీ తాను విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి లేఖ రాశాడు. తన ఆరోగ్యం పరిస్థితి బాగాలేని కారణంగా ఇండియాలో విచారణకు రాలేనంటూ సమాచారం అందించాడు. ఆంటిగ్వానుంచి 41గంటలకుపాటు ప్రయాణం చేయలేనని బొంబాయి కోర్టు విచారణకు రాలేనని చెప్పుకొచ్చాడు. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతించాలని కోరాడు.
బ్యాంకులతో తాను నిరంతరం టచ్‌లోనే ఉంటూ, సమస్య పరిష్కానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. అంతేకాదు తన అనారోగ్య పరిస్థితులను కావాలనే ఈడీ తప్పుదోవపట్టించేలా దాచిపెడుతోందని ఆరోపించాడు. కాగా గీతాంజలి గ్రూపు అధిపతి మొహుల్ చోక్సిని ఫ్యుజిటివ్ ఆర్ధికనేరస్థుడిగా ప్రకటించడంతోపాటు, ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ఈడీ బొంబాయి కోర్టును కోరింది.
విదేశాల్లో రుణాలను పొందేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా నకిలీ హామీలతో 13వేల కోట్ల రూపాయల కుంభకోణంలో డైమండ్ వ్యాపారం నీరవ్‌మోదీ ఆయన మామ చోక్సీ నిందితులు. ఈ స్కాం వెలుగులోకి రావడంతో విదేశాలకు చెక్కేసిన చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వాన్ని పొందాడు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, డిసెంబరులో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అటు నీరవ్‌మోదీని, ఇటు ఆంటిగ్వా నుండి చోక్సిని తిరిగి దేశానికి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment