
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి మరో కీలక పరిణామం చోసుకుంది. ఈ కుంభకోణంలో కీలక నిందితుడు నీరవ్ మోదీ సమీప బంధువు, మరో కీలక నిందితుడు, వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీపై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చార్జిషీటు దాఖలు చేసింది.
పీఎన్‌బీ స్కాంలో మెహల్ చోక్సీ సహా మరో 13 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ చట్టం (పిఎంఎల్ఏ) సెక్షన్ 4 కింద దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో 5 కంపెనీలు ఉన్నాయి. ముంబైలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టుకు ముందు ఈడీ దీన్ని దాఖలు చేసింది. మెహల్ చోక్సి కి చెందిన గీతజాలి జెమ్స్ లిమిటెడ్, గిల్లి ఇండియా, నక్షత్ర బ్రాండ్లు లిమిటెడ్‌కు చెందిన మూడు కంపెనీలు ఇందులో ఉన్నాయి. వీటికి అక్రమ పద్దతుల్లో రూ. 3011.39 ఎల్‌ఓయూలు జారీ అయినట్టు ఈడీ ఆరోపిస్తోంది.
ఇది ఇలావుంటే అనారోగ్య కారణాలరీత్యా తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలని చోక్సీ కోరారు. తన న్యాయవాది ద్వారా బుధవారం, ముంబై ప్రత్యేక సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో తాను ఎక్కడున్నదీ బహిర్గతం చేయలేననీ, వైద్య కారణాల వలన ప్రయాణం చేయలేనని చోక్సీ పేర్కొన్నాడు. అందుకే తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment