జలంధర్: టీమిండియా పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ చేసిన పని సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఒలింపిక్స్ నుంచి ఇటీవలే తన ఇంటికి చేరుకున్న మన్‌ప్రీత్ కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపాడు. ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లికి చూపించి మురిసిపోయాడు. ఆ తర్వాత తన తల్లి మెడలో ఆ పతకాన్ని వేసి.. ఒడిలో హాయిగా నిద్రపోతున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.
ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతం చేసింది. పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ లీగ్‌లో ఆస్ట్రేలియా మినహా మిగతా జట్లపై మంచి విజయాలను నమోదు చేసింది. ఇక సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓడినప్పటికి.. జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అద్భుతంగా ఆడిన మెన్స్ టీమ్ 5-4 తేడాతో విజయం సాధించి 41 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించింది. ఈ విజయంలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ కీలకం.. ఒత్తిడి సమయాల్లో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. కాగా ఇటీవలే టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్న పురుషుల హాకీ జట్టు సభ్యులకు ఘన స్వాగతం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment