టోక్యో: ప్రపంచంలోని ప్రతి అథ్లెట్ కనీసం ఒక్క ఒలింపిక్స్ అయినా ఆడాలని కలగనడం సహజం. ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్‌వెల్త్‌గేమ్స్, ఏషియన్ గేమ్స్ ఇలా వేటిలో పతకాలు సాధించినా.. ఒలింపిక్స్‌లో సాధించే పతకానికి క్రేజ్ వేరే ఉంటుంది. పతకం గెలిచినా గెలవకపోయినా.. తాము ఆడుతున్న దేశం తరపున కనీసం ఒక్క ఒలింపిక్స్‌లో అయినా పాల్గొనాలని అనుకుంటారు. అయితే ఉజ్బెకిస్తాన్‌కు చెందిన వాల్ట్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా వరుసగా 8 ఒలింపిక్స్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది.
1992 బార్సిలోనా ఒలింపిక్స్ మొదలుకొని 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు ఒక్కసారి కూడా మిస్ కాకుండా పాల్గొనడం విశేషం. అంతేగాక మూడు దేశాల తరపున ఒలింపిక్స్‌లో ఆడిన రెండో జిమ్నాస్ట్ మహిళగా చుసోవిటినా రికార్డు సాధించింది. 8 ఒలింపిక్స్‌లో ఆడిన ఆమె 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం విశేషం.
తాజాగా అత్యధిక ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఒక్సానాకు స్టాండింగ్ ఒవేషన్(ఘనమైన వీడ్కోలు) లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తనకు ఇవే చివరి ఒలింపిక్స్ అని ఒక్సానా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే చెప్పింది. ఈసారి ఒలింపిక్స్‌లో వాల్ట్ జిమ్నాస్టిక్స్‌లో రెండు వాల్ట్స్ పూర్తి చేసి 14.166 స్కోరు నమోదు చేశాడు. అయితే ఆమె చేసిన స్కోరు సరిపోకపోవడంతో క్వాలిఫికేషన్ రౌండ్ నుంచే వెనుదిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment