Hockey Legend Charanjit Singh Passed Away: భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత చరణ్‌జిత్ సింగ్(90) కన్నుమూశారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు సారధిగా వ్యవహరించిన ఈ మాజీ మిడ్ ఫీల్డ్ ఆటగాడు.. ఇవాళ ఉదయం హిమాచల్ ప్రదేశ్‌లోని తన స్వగృహంలో తనువు చాలించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుత్ను ఆయన.. కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు దృవీకరించారు. చరణ్‌జిత్ మరణ వార్తను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. చరణ్‌జిత్ సింగ్ మృతి పట్ల భారత హాకీ సమాఖ్య విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించింది.
On behalf of Hockey India, we mourn the loss of a great figure of Indian Hockey, Shri Charanjit Singh.
— Hockey India (@TheHockeyIndia) January 27, 2022
May his soul Rest in Peace🙏 pic.twitter.com/PTb38lHDS6
చదవండి: అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్
Comments
Please login to add a commentAdd a comment